జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్‌కు టీజేఏ, ఎన్‌యూజే (ఐ) వినతి

2చూసినవారు
జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్‌కు టీజేఏ, ఎన్‌యూజే (ఐ) వినతి
కామారెడ్డిలో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత, సంక్షేమ పథకాలు కల్పించాలని కోరుతూ టీజేఏ, ఎన్‌యూజే (ఐ) జిల్లా కమిటీలు కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఎన్. వై. గిరికి మంగళవారం వినతిపత్రం అందజేశాయి. జిల్లా అధ్యక్షులు సడక్ సునీల్ ఈ సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్