ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, వైస్ చైర్ పర్సన్ మత్తమాల భాగ్యవతిలను, వార్డు కౌన్సిలర్లను టిఎన్జిఓస్ (తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్) ఎల్లారెడ్డి తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా, చైర్మన్, వైస్ చైర్ పర్సన్ ల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఎన్జిఓలు ఆకాంక్షించారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల విస్తరణ, ప్రజాభివృద్ధి కార్యక్రమాలలో టిఎన్జిఓస్ తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని వారు హామీ ఇచ్చారు.