కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శుక్రవారం 12వ టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చింతల లింగం టీపీటీఎఫ్ పతాకావిష్కరణ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీపీటీఎఫ్ ఎల్లప్పుడూ పోరాడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్, అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు నళిని మేడం, శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు నరేందర్ గోపు శ్రీనివాస్, మంగమ్మ, కామారెడ్డి మండల అధ్యక్షుడు గ్యార బాబయ్య పాల్గొన్నారు.