కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ను అభివృద్ధి చేస్తానని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. శనివారం డీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్ గౌడ్, బ్లాక్
కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, భిక్కనూరు మాజీ జడ్పీటీసీ సభ్యుడు నంద రమేష్ హైదరాబాద్ లోని మంత్రి చాంబర్ లో మంత్రిని కలిసి కామారెడ్డి అభివృద్ధిపై చర్చించారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు
కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వారి వెంట పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ్ ఆనంద్, అల్లాడి సుదర్శన్ కూడా ఉన్నారు.