ఎల్లారెడ్డి పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా, జనవరి 13న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదివారం తెలిపారు. పట్టణంలోని బస్ డిపో స్థలాన్ని పరిశీలించి, మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తన అధ్వర్యంలో పోటీ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని, విజేతలకు బహుమతులు ఉంటాయని తెలిపారు.