కామారెడ్డి జిల్లా పోలీసులు నేరస్తులను ఎంతటి వారైనా వదలరని మరోసారి నిరూపించారు. ఉగ్రవాయి గ్రామ శివారులో మేస్త్రి శివశంకరును కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు కేవలం 96 గంటల్లోనే సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. క్షణికావేశంలో చేసే నేరాలు జీవితాలను నాశనం చేస్తాయని ఈ ఘటన హెచ్చరిస్తోంది.