రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

0చూసినవారు
రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి
కామారెడ్డి పట్టణంలో శనివారం, 11 జూన్ 2026 రాత్రి పాత రాజంపేట ఏరియాలోని వేలుమా ఫంక్షన్ హాల్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా గుర్తుతెలియని మహిళ రైలు ఢీకొని మృతి చెందింది. రైల్వే ఎస్ఐ లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలి వయసు సుమారు 40-50 సంవత్సరాలు. ఆమె ఎడమ చేతిపై పుట్టుమచ్చ, రెండు చిన్న ముక్కుపుడకలు, చెవులకు మూడు చోట్ల చిన్న కమ్మలు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా మహిళను గుర్తిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :