ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న జాతీయ రహదారి పనులకు వ్యాపారస్థులు, దుకాణ, ఇంటి యజమానులు, ప్రజలు సహకరించాలని ఆర్డీఓ పార్థ సింహారెడ్డి కోరారు. మంగళవారం ఆయన వ్యాపార సముదాయ, షాపు, ఇంటి యజమానులతో సమావేశమై, రహదారి అభివృద్ధి పనులు ప్రజల సౌకర్యం కోసమే జరుగుతున్నాయని, పనులకు ఎవరూ ఆటంకం కలిగించవద్దని సూచించారు.