యూరియా సమస్య తలెత్తకుండ చూడాలి: ఎమ్మెల్యే

3చూసినవారు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్లో రైతులకు యూరియా సమస్య తలెత్తకుండా, సరఫరా సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాడ్వాయి, సదాశివనగర్ మండలాల్లో మొక్కజొన్న పంట నష్టంపై నివేదిక సిద్ధం చేసి రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం తాగునీటిపై సమీక్షించి, సెగ్మెంట్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్