ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన బధిరుడు మంగళి రమేష్ కు గ్రామ నూతన సర్పంచ్ పటేల్ సాయిలు గురువారం తన స్వంత నిధుల నుంచి రూ. 2వేల రూపాయల ఫించన్ ను అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ప్రభుత్వం నుంచి ఫించన్ మంజూరయ్యే వరకు ప్రతి నెలా ఈ మొత్తాన్ని అందిస్తానని సర్పంచ్ తెలిపారు. రమేష్ కుమారుడు, మరణించిన భార్య తప్ప ఆసరాగా ఎవరూ లేరని గమనార్హం.