కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా వెంకట్గౌడ్ ఎన్నిక

2చూసినవారు
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా వెంకట్గౌడ్ ఎన్నిక
సూర్యాపేటలో 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ మహాసభల్లో జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు ఏకగ్రీవంగా నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా నుండి వెంకట్ గౌడ్, శంకర్ గౌడ్, రాజాగౌడ్ లు రాష్ట్ర కమిటీలోకి ఎన్నికయ్యారు. సైదగౌని వెంకట్ గౌడ్ ను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అనంతరం వెంకట్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో కల్లు గీత వృత్తి రక్షణకై గౌడ గీత కార్మికులను ఐక్యం చేసి పోరాటాలు చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్