మెల్ల కుంట తండాలో పశు వైద్య శిబిరం

2చూసినవారు
మెల్ల కుంట తండాలో పశు వైద్య శిబిరం
నాగిరెడ్డిపేట మండలం మెల్ల కుంట తండా గ్రామపంచాయతీలో బుధవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. మండల పశువైద్యాధికారి డాక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలోని 165 పశువులకు, 85 గేదెలకు (ఎఫ్ఎండి) ఫుడ్ అండ్ మౌత్ వ్యాక్సిన్ వేశారు. పశువులకు రోగ నిరోధక శక్తి పెంచడానికి టీకాలు తప్పనిసరిగా వేయించాలని పశువుల యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమావత్ బాల్య నాయక్, ఉప సర్పంచ్ వాసు రామ్ నాయక్, పశు వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్