గో సంరక్షణపై ఎల్లారెడ్డి తహసీల్దార్ కు విహెచ్పీ బీడి వినతి

2చూసినవారు
సోమవారం ఎల్లారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు తహశీల్దార్ ప్రేమ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. గోవు సంస్కృతి, సంప్రదాయం, ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమని, దానిని జాతీయ జంతువుగా ప్రకటించాలని, గో సంరక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని, గో సేవ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజు గౌడ్, గాదె తిరుపతి, వినోద్, తులసి, నవీన్, హర్షవర్దన్ తో పాటు పలువురు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.