కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు సోమవారం ముట్టడించారు. విద్యుత్ కోతలకు నిరసనగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, లైన్మెన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరారు.