ఈ నెల 4 నుండి 10వరకు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో వార్డు సభలు

0చూసినవారు
ఈ నెల 4 నుండి 10వరకు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో వార్డు సభలు
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద ఈ నెల 4 నుండి 10వ తేదీ వరకు వార్డు సభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగే ఈ సభల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాల నిర్వహణ, వర్షాకాల సన్నద్ధత, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రజలతో చర్చించి, అవసరమైన చర్యలు తీసుకుంటారు. జూన్ 4న 1, 2, 3 వార్డుల్లో, 6న 4, 5, 6 వార్డుల్లో, 7న 7, 8, 9 వార్డుల్లో, 10వ తేదీన 10, 11, 12 వార్డుల్లో ఈ సభలు జరుగుతాయి.

సంబంధిత పోస్ట్