డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలి.. జీవియం విఠల్

1చూసినవారు
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలి.. జీవియం విఠల్
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో భగత్‌సింగ్ జయంతి సందర్భంగా AISA జిల్లా కన్వీనర్ జీవియం విఠల్ సోమవారం  మాట్లాడుతూ భగత్‌సింగ్ ఆశయాలతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, విద్యారంగ పరిరక్షణ కోసం విద్యార్థులు, యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, మధు, మనోజ్ సాయి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్