12వార్డులో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలి

5చూసినవారు
12వార్డులో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలి
ఎల్లారెడ్డి మున్సిపల్ లోని 12వార్డులో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రతీ కార్యకర్త, నాయకులు సమిష్టిగా కృషి చేయాలనీ బీజేపీ రాష్ట్ర నేత డా. పైడి ఎల్లారెడ్డి అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం భవనంలో మున్సిపల్ ఎన్నికల ముఖ్య సమావేశంలో ఆయన, ఎల్లారెడ్డి ఎన్నికల ఇన్చార్జి విజిత్ వర్మ కలిసి పాల్గొన్నారు. ఎల్లారెడ్డి 12 వార్డులో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలుపే లక్ష్యంగా ప్రచారం చేయాలనీ, పెద్ద ప్రజలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలను వివరిస్తూ ఓటర్లకు ఓట్లు అడగాలి అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు నర్సింలు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్