పల్స్ పోలియో విజయవంతం చేస్తాం

1చూసినవారు
పల్స్ పోలియో విజయవంతం చేస్తాం
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో వార్డు కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని 6వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ గఫ్ఫార్ తెలిపారు. ఆదివారం ఆయన తన వార్డులో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు తమ వార్డుల్లో చురుకుగా పోలియో చుక్కలు వేయిస్తున్నారని, తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్