వచ్చే వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన డిఎంతో ఫోన్‌లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం సకాలంలో తరలింపు జరగకపోవడం, రవాణా, లారీల ఏర్పాటులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం సమీపిస్తున్నందున, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన అన్నారు.