ఎల్లారెడ్డి తహశీల్దార్ ప్రేమ్ కుమార్ మంగళవారం లక్ష్మాపూర్ గ్రామంలో అనుమతులు లేకుండా నడుస్తున్న ఇటుక బట్టీలను తనిఖీ చేశారు. అనుమతులు, మైనింగ్, విద్యుత్, రెవెన్యూ పత్రాలు లేని బట్టీలను సీజ్ చేసి, బాల కార్మికులను వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. భూమి సర్వే నంబర్, పట్టాదారు వివరాలను కూడా ఆయన పరిశీలించారు. చట్టవిరుద్ధంగా నడుస్తున్న బట్టీలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.