ఆరోగ్య ఉపకేంద్రం కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తాం

5చూసినవారు
ఆరోగ్య ఉపకేంద్రం కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తాం
ఎల్లారెడ్డి మండలం బిక్కనూర్లో ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణం కోసం అనువైన ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేస్తామని ఆర్డీఓ పార్థ సింహారెడ్డి తెలిపారు. ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ అభ్యర్థన మేరకు, సోమవారం ఆర్డీఓ, సామాజిక ఆరోగ్య అధికారి, పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామంలో పర్యటించి స్థలాన్ని పరిశీలించారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేసి ఆరోగ్య శాఖకు అప్పగిస్తామని ఆయన పేర్కొన్నారు.