కాలు ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అందజేత

2చూసినవారు
కాలు ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అందజేత
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో ప్రమాదంలో గాయపడి, కాలు ఆపరేషన్ కోసం 'ఏ పాజిటివ్' రక్తం అవసరమైంది. రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో, బాధితుని కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. డాక్టర్ బాలు స్పందించి, పట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కస్వ సుజిత్ సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేశారు. ఈ సహాయానికి బాధితుని కుటుంబ సభ్యులు సుజిత్, డాక్టర్ బాలులకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్