అమృత్-2 పథకం పనులపై సీఎంకు ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే

8చూసినవారు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో జరుగుతున్న అమృత్-2 పనుల్లో జాప్యంపై ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అధికారులను హెచ్చరించారు. పనుల ఆలస్యం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి, పనుల్లో నిర్లక్ష్యంపై నిలదీశారు. పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు.