ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సందర్శించారు. గత రెండు రోజుల క్రితం గ్రామ రైతులు ధాన్యం కొనుగోలు సమస్యలపై నిరసనలు చేపట్టిన నేపథ్యంలో, రైతులకు అండగా ఉండేందుకే తాను ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపారు. లారీలు రాక ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో రైతులు ధాన్యం తగులబెట్టే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తరలింపు విషయంలో ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.