కామారెడ్డి జిల్లాలో తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా, ఎల్లారెడ్డి సెగ్మెంట్ పరిధిలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఆకుల లక్ష్మి అనే మహిళ వడదెబ్బతో మరణించింది. రాబోయే రెండు మూడు రోజులు కూడా ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.