బీబీపేటకి చెందిన నందిని, తన కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టరేట్ కు పాదయాత్రగా వెళ్ళింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి, సాంకేతిక కారణాల వల్ల ఆన్లైన్లో నిలిచిపోయిన ఆమె దరఖాస్తును పరిశీలించి, సమస్యను పరిష్కరించారు. నందినికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు నిర్మాణానికి అవసరమైన మార్కౌట్ ప్రక్రియను పూర్తి చేసినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు.