ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో జరిగిన రుణాల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్హులైన మహిళా సంఘాలకు రుణాల మంజూరు పత్రాలను ఈ సందర్భంగా అందజేశారు.