ఎల్లారెడ్డి పట్టణంలోని న్యూఅభాది ప్రాంతంలో మమత హోటల్ దగ్గర నుంచి బీసీ కాలనీ చివరి వరకు సీసీ రోడ్డు పనులు శనివారం ప్రారంభమయ్యాయి. మొదట 12 ఫీట్లకు ప్రతిపాదించిన ఈ రోడ్డును, వార్డు యువకులు, కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు 17 ఫీట్లకు పెంచి పనులు చేపట్టారు. చాలా కాలంగా గుంతలతో నిండి ఉన్న ఈ రహదారిలో సీసీ రోడ్డు పనులు మొదలవ్వడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.