కామారెడ్డి సెగ్మెంట్ భిక్కనూర్ గ్రామంలో ఆదివారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలకు కొబ్బరికాయ కుస్తీ నుండి 4000 రూపాయలు, వెండి కడియం, 2 తులాల బహుమతులు ప్రధానం చేశారు. గ్రామ సర్పంచ్ శ్రీ చాకలి సాయిలు, ఉప సర్పంచ్ మ్యాతరి ఆంధ్రయ్య, వార్డ్ మెంబర్స్, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి సమక్షంలో విజేతలకు బహుమతులను గ్రామ సర్పంచ్ అందజేశారు.