ఎల్లారెడ్డి 1వ వార్డులోని జగదంబ సేవాలాల్ మహారాజ్ మందిరంలో ఆదివారం ఎఐబిఎస్ఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ను ఘనంగా సత్కరించారు. పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ అనంతరం చైర్మన్ మాట్లాడుతూ, రామ్ రావు మహారాజ్ 75 ఏళ్లుగా బంజారా సోదరుల అస్తిత్వ పరిరక్షణకు చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు మంచిర్యాల విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకులు రఫీక్, డాక్టర్ తమ్మల శ్యామ్ లను కూడా సన్మానించారు.