ఎల్లారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ పాలకవర్గం బాధ్యతలు స్వీకరణ

1చూసినవారు
ఎల్లారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ పాలకవర్గం బాధ్యతలు స్వీకరణ
కోర్టు తీర్పుతో బుధవారం ఎల్లారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ ఏగుల నర్సింలు, వైస్ చైర్మెన్ ప్రశాంత్ గౌడ్, డైరెక్టర్లు తమ బాధ్యతలను స్వీకరించారు. సొసైటీ చైర్మన్లను, డైరెక్టర్లను కొనసాగించాలని, ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రమాణ స్వీకారం చేయాలని కోరడంతో వారు బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యాన్ని సేకరించి వారికి సహకరించాలని, వర్షాల వల్ల ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నందున ఎగుమతులు దిగుమతులు త్వరగా జరగాలని కోరారు.

ట్యాగ్స్ :