ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో శనివారం జరిగిన తైబజార్ వేలం ద్వారా 8 లక్షల 40 వేల రూపాయల ఆదాయం వచ్చిందని మున్సిపల్ కమిషనర్ ఎ. మహేష్ కుమార్ తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ వేలంలో, గత సంవత్సరం 7,55,000 రూపాయలకు దక్కిన వారాంతపు సంతను ఈసారి జంగం సుభాషప్ప 8,40,000 రూపాయలకు దక్కించుకున్నారు. తై బజార్, రోజువారీ సంత, పశువుల సంత వేలంపాటలు వాయిదా పడ్డాయి. మొత్తం 8 మంది వేలం పాటలో పాల్గొన్నారు.