ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ పద్మ శ్రీకాంత్ ఆదివారం 10వ వార్డులో పల్స్ పోలియో చుక్కల మందు వేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి అంగన్వాడి సెంటర్ వద్దకు వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ నర్సింగ్ చౌహన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్, హెచ్ఈఓ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.