కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామంలో శుక్రవారం వినాయక నిమజ్జనోత్సవంలో డీజే పర్మిషన్ కోసం కురుమ మహేష్ అనే యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశాడు. సీఎం రేవంత్ రెడ్డి పాట వేయాలని డిమాండ్ చేస్తూ, లేదంటే ట్యాంక్ పై నుంచి దూకుతానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, యువకుడిని నచ్చజెప్పి కిందకు దించారు. ఈ ఘటన ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రాంతాలలో కలకలం రేపింది.