విడాకుల కారణంగా మనస్తాపం చెంది, మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో నిజాంసాగర్ ప్రాజెక్టులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జుక్కల్ సెగ్మెంట్లోని నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ కు చెందిన ఎన్. సంగమేశ్వర్(30) నిజాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్ల సమీపంలోని గణేశ్ ఆలయం వద్ద జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నిజాంసాగర్ సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. మృతుడి తండ్రి హన్మండ్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.