
భార్య కొట్టిందని బావిలోకి దూకేసిన భర్త.. చివరికి..!
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. భార్యతో జరిగిన గొడవ కారణంగా భర్త బావిలోకి దూకాడు. అసోహా పోలీస్స్టేషన్ పరిధిలోని రాణిపూర్ గ్రామానికి చెందిన సునీల్ రావత్ (35) భార్యతో గొడవపడి, ఆమె తనను కొట్టిందనే కోపంతో 100 అడుగుల లోతైన బావిలోకి దూకేశాడు. రెండు గంటలపాటు బావిలోనే కూర్చున్నాడు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాడుతో అతడిని సురక్షితంగా బయటకు తీశారు.




