
సీజేఐ గవాయ్‌పై దాడికి యత్నం.. లాయర్‌పై కేసు నమోదు
సుప్రీంకోర్టులో సీజేఐ బీఆర్ గవాయ్‌పై కిషోర్ రాకేశ్ అనే ఆ లాయర్ షూ విసిరేందుకు ప్రయత్నించారు. దీంతో అతన్ని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సనాతన ధర్మంపై నినాదాలు చేసిన అతన్ని కోర్టు రూమ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఖజురహో కేసులో సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యల వివాదం దీనికి కారణమని భావిస్తున్నారు. అయితే, సీజేఐ గవాయ్ ఈ ఘటనతో అధైర్యపడకుండా, వాదనలు కొనసాగించమని లాయర్లను కోరారు.




