
ఎయిర్టెల్కు రైల్వే కాంట్రాక్టు.. ఇక ఆ బాధ్యత వారిదే
భారతీయ రైల్వే భద్రతా కార్యకలాపాల కేంద్రం (ఐఆర్ఎస్ఓసీ) కోసం సెక్యూరిటీ సేవలను అందించేందుకు ఎయిర్టెల్ బిజినెస్ ఒక బహుళ సంవత్సరాల ఒప్పందాన్ని గెలుచుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్టెల్ భారతీయ రైల్వే ఐటీ వ్యవస్థను రక్షించడానికి గ్రీన్ఫీల్డ్, మల్టీలేయర్ సైబర్ సెక్యూరిటీ రక్షణ వ్యవస్థను రూపొందించి, నిర్మించి, అమలు చేసి, నిర్వహిస్తుంది. రైల్వే సేవల ఎండ్-టు-ఎండ్ డిజిటల్ కార్యకలాపాలను కూడా ఇది రక్షిస్తుంది.




