
డ్రైవర్‍తో ఎఫైర్.. భర్తను పాముతో కాటు వేయించి చంపిన భార్య
యూపీలోని మీరట్ జిల్లా హస్తినాపురంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. భందోరా గ్రామానికి చెందిన అతుల్ పన్వార్ (35), దామిని దంపతులు హస్తినాపూర్‌లో ఓ స్కూల్ నడుపుతున్నారు. ఈ క్రమంలో దామినికి స్కూల్ బస్ డ్రైవర్ తుషార్‌తో ఎఫైర్ ఏర్పడింది. ఈ మేరకు భర్తను హత్య చేసి అతని పేరుపై ఉన్న రూ.20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని ఇద్దరూ ప్లాన్ చేశారు. గురువారం రాత్రి దామిని తన ప్రియుడితో కలిసి పాముతో కాటు వేయించి భర్త అతుల్‌ను హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం తేలింది.




