TG: సఫిల్‌గూడ కట్ట మైసమ్మ ఆలయ ఘటనపై నటి కరాటే కల్యాణి తీవ్రంగా స్పందించారు. ఎందుకు హిందూ దేవతలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇంత ఘోరంగా ప్రవర్తించిన వ్యక్తిని పిచ్చోడని ఎలా అంటారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించకూడదని, నిందితులను వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు సహించబోమని ఆమె స్పష్టం చేశారు.