Feb 07, 2026, 13:02 IST/
భారత్-పాక్ మ్యాచ్‌పై పాక్ యూటర్న్? ఐసీసీ హెచ్చరికలు
Feb 07, 2026, 13:02 IST
భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌పై వివాదాలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. అయితే, ఐసీసీ చర్యలు, ఆర్థిక నష్టం, శ్రీలంక ఒత్తిడి నేపథ్యంలో పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకుంటుందని తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) 'ఫోర్స్ మజురే' నిబంధనను ఉపయోగిస్తూ మ్యాచ్‌ను తిరస్కరించడానికి లేఖ రాసింది. ఐసీసీ ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తే చర్యలు, నష్టపరిహారం తప్పవని హెచ్చరించింది. కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను ఆడాలని శ్రీలంక బోర్డు పాకిస్తాన్‌ను కోరింది. ఈ మ్యాచ్ రద్దు అయితే తమ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని శ్రీలంక పేర్కొంది.