
కెసిఆర్ జన్మదిన వేడుకలు చిన్నారులు ఘనంగా చేశారు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బోయినపల్లి మండలం తడగొండలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు, చిన్నారులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు వర్థిల్లాలని అభిమానులు, ప్రజలు కోరుకున్నారు. ఈ వేడుకల్లో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ దీర్ఘాయుష్షును ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.






































