వ్యక్తిపై దాడి కేసులో నిందితుడు రిమాండ్‌కు తరలింపు.. ఏఎస్పీ

3చూసినవారు
వ్యక్తిపై దాడి కేసులో నిందితుడు రిమాండ్‌కు తరలింపు.. ఏఎస్పీ
వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి తెలిపిన వివరాల ప్రకారం, బోయినపల్లి మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన గండి శ్రీధర్, అదే గ్రామానికి చెందిన సావనపెల్లి శశి ప్రీతమ్ పై 07.01.2026న కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో బాధితుడు గాయపడ్డాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుడు గండి శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, నేరానికి ఉపయోగించిన కత్తి, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఈరోజు రిమాండ్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్