చొప్పదండి: ఈనెల 28న నవోదయ ప్రవేశ పరీక్ష

13చూసినవారు
చొప్పదండి: ఈనెల 28న నవోదయ ప్రవేశ పరీక్ష
కరీంనగర్ జిల్లా చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఈ నెల 28వ తేదీన ముందుగా నిర్ణయించిన ప్రకారమే నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఉదయం 11: 30 గంటల నుండి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాల్లో 3888 విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్