చొప్పదండి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు ప్రియదర్శిని మంగళవారం ఒక ప్రకటనలో కోతుల బెడద లేని, ప్రకృతి వైపరీత్యాలకు నష్టం వాటిల్లని ఆయిల్ పామ్ పంట సాగు చేసి రైతులు అధిక ఆదాయాన్ని పొందాలని కోరారు. ఆయిల్ పామ్ పంటకు సరైన మార్కెట్ వ్యవస్థ ఉందని, స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. పామ్ మొక్కలు సబ్సిడీపై లభిస్తాయని, ఒక ఎకరానికి సంవత్సరానికి రు. 4200 నిర్వహణ ఖర్చులు రైతుల ఖాతాలో జమ చేస్తామని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.