చొప్పదండి మండలం రుక్మాపూర్ - ఫకీర్ పేట్ గ్రామాల మధ్య లింక్ రోడ్డు అద్వానంగా తయారు అయింది. రుక్మాపూర్, ఫకీర్ పేట్, జూబిలీ, చామనపెల్లి, చాకుంట గ్రామాల ప్రజలు నిత్యం ఈ రోడ్డు గుండానే ప్రయాణిస్తూ ఉంటారు. పాలకులు ఎవరూ ఈ రోడ్డును పట్టించుకోక పోగ ఇటీవల వర్షాలకు మరింత దెబ్బ తింది. బైక్ పై వెల్లే వారికి సర్కస్ ఫీట్లు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీసీ రోడ్డు వేయాలని గురువారం ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.