చొప్పదండి పట్టణం 9వ వార్డుకు చెందిన వడ్లూరు నరేష్ (40) అనారోగ్యంతో మృతి చెందగా పేద కుటుంబం కావడంతో రామకృష్ణ సేవా సమితి ఆర్థిక సాయం అందించింది. నరేష్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆర్థిక సహాయం కొరకు సేవాసమితిని సంప్రదించగా సమితి సభ్యుడు సింహాచలం హరికృష్ణ స్పందించారు. ఈ మేరకు రూ. 5000 సమితి బాధ్యుడు శంకరయ్య చేతుల మీదుగా అందజేశారు. మండల విహెచ్పి అధ్యక్షుడు పడకండి కృష్ణ పాల్గొన్నారు.