చొప్పదండి రైతు వేదికలో బుధవారం ఆత్మ బ్లాక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. 2026-27 సంవత్సరానికి కరీంనగర్ జిల్లాకు ఆత్మ ద్వారా రూ. 19. 392 లక్షలు కేటాయించినట్లు వ్యవసాయ సహాయ సంచాలకులు ప్రియదర్శిని తెలిపారు. చొప్పదండి డివిజన్కు 15 క్షేత్ర ప్రదర్శనలు, 3 శిక్షణలు, 2 పొలంబడి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పంట మార్పిడి, సస్యరక్షణ, ఎరువుల యాజమాన్యంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఆత్మ చైర్మన్ గుర్రం రాజేందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.