మ్యాడంపెల్లిలో సీసీ రోడ్డు పనులకు బండి సంజయ్ శంకుస్థాపన

967చూసినవారు
మ్యాడంపెల్లిలో సీసీ రోడ్డు పనులకు బండి సంజయ్ శంకుస్థాపన
కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలంలోని మ్యాడంపెల్లి గ్రామంలో మంగళవారం దిండు బుజందర్ ఇంటి నుండి జానుప మల్లయ్య ఇంటి వరకు రూ. 5 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు పనులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాతం అంజయ్య, ఉప సర్పంచ్ కొక్కెర మల్లేష్ యాదవ్, వార్డ్ మెంబర్, గ్రామ కార్యదర్శి సుజాత, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ మల్లేష్ యాదవ్ ఈ రోడ్డు పనులను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్