ఆస్ట్రేలియాలో బతుకమ్మ వేడుకలకు: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

1163చూసినవారు
ఆస్ట్రేలియాలో బతుకమ్మ వేడుకలకు: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ లాండ్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్స్ నగరంలో ఈనెల 27వ తేదీన నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలకు చొప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరవుతున్నారు. గత వారం రోజుల క్రితం అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈనెల 22వ తేదీన రాత్రి హైదరాబాద్ నుండి ఆస్ట్రేలియాకు బయలుదేరి, 27న బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారని ఆదివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్